సన్నుతింతు యేసు స్వామి
Sannuthimthu Yaesu Svaami
UncategorizedAdded on 10/27/2016
Lyrics
నీ మహాత్య కార్యములను పాడి వివరింతును శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను ||సన్నుతింతు|| సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును ||సన్నుతింతును|| మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము ||సన్నుతింతును||