సరిచేయుమో దేవా
Sarichaeyumo Daevaa
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 3/11/2017
Lyrics
సరిచేయుమో దేవా నన్ను బలపరచుమో ప్రభువా నీ ఆత్మతో నను అభిషేకించి సరి చేయుమో దేవా దూరమైతి నీ సన్నిధి విడచి పారిపోతి నీ గాయము రేపి లోకమునే స్నేహించితి నేను పాపము మదిలో నింపుకున్న అది తప్పని తెలిసి తిరిగి వచ్చి నీ సన్నిధిలో నే మోకరించి బ్రతిమాలుచున్నాను నన్ను సరి చేయుమో దేవా నింపుము నీ వాక్యము మదిలో పెంచుము నను నీ పాలనలో శోధనను గెలిచే ప్రతి మార్గం ఇవ్వుము నాకు ప్రతి క్షణము నీ సన్నిధిలో ఒక దినమైనను వేయి దినములకంటే బహుశ్రేష్టము.. అని తెలుసుకున్నాను నన్ను సరి చేయుమో దేవా