సర్వాంగ సుందరా
Sarvaamga Sumdaraa
UncategorizedAdded on 5/8/2016
Lyrics
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ|| నా శాపములు బాపినావా నా ఆశ్రయ పురమైతివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా (2) ||సర్వాంగ|| నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై నాకు జయ ధ్వజమైతివా (2) ||సర్వాంగ||