సర్వశక్తుని స్తోత్రగానము
Sarvashakthuni Sthothragaanamu
Lyricistసర్వశక్తుని స్తోత్రగానము
UncategorizedAdded on 6/8/2020
Lyrics
సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెద రాజిల్లను ముదముతో నిర్మానకుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వoచి దేవుని వందనముతో వేడరే వేదపారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవు నిక మీ స్వాoతమున బూజింపరే ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుఁగా నుతి జేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే చావు పుట్టుక లేనివాడుగ సంతతము జీవించును ఈవులిచ్చుచు దన్ను వేడు మ- హేష్టులను రక్షించును దాసులై దేవునికి నెదలో దర్పమును బోగాల్పరే యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము నే మరక మైదాల్పరే