శాశ్వత ప్రేమతో
Shaashvatha Praematho
UncategorizedAdded on 2/12/2017
Lyrics
కృప చూపి నన్ను రక్షించవయ్యా నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది అనాథనైనా నన్ను వెదకి వచ్చావు ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2) ||నీ ప్రేమ|| అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2) ||నీ ప్రేమ|| తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి (2) ||నీ ప్రేమ|| నడుచుచున్న మర్గమంత యోచించగా కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2) ||నీ ప్రేమ|| ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు సమస్తము మేలుకై చేసిన దేవా (2) ||నీ ప్రేమ||