శాశ్వతమా ఈ దేహం
Shaashvathamaa Ee Daehm
UncategorizedAdded on 10/6/2020
Lyrics
శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా… శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలనో అనుక్షణము నీటిపైన చిరు బుడగ వోలె – దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా|| ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనవి తీరేనా నీ తనువే రాలిపోయినా – నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా|| దేహ వాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందువో – చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||