శక్తి చేత కాదు
Shakthi Chaetha Kaadu
Lyricistఆకుమర్తి డానియెల్
UncategorizedAdded on 8/13/2021
Lyrics
శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము (2) ||శక్తి|| నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని చేసెను దేవుడు శూన్యము నుండి తన రూపులో తన పోలికలో నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2) ||శక్తి|| కౄరమైన సింహాల బోనైననూ విశ్వాసముతో సాగెను దానియేలు అగ్ని గుండములో మరణ శాసనములో ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2) ||శక్తి|| ఘోరమైన పాపాల బానిసైననూ భారమైన బ్రతుకును గడుపుచున్ననూ ప్రియమార నిన్నే పిలువంగ యేసు దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2) ||శక్తి||