శ్రమలందు నీవు

Shramalmdu Neevu

Lyricistదొరబాబు
UncategorizedAdded on 12/15/2022

Lyrics

శ్రమలందు నీవు నలిగే సమయమున
ప్రభు నీకు తోడుండునని
యోచించలేదా? గమనించలేదా?
ఇమ్మానుయేలుండునని
||శ్రమలందు||
శ్రమలందు ఏలియాకు కాకోలముచేత
ఆహారము పంపించ లేదా?
ఈనాడు నీకు జీవాహారముతో
నీ ఆకలి తీర్చుట లేదా?
(2)         ||శ్రమలందు||
శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి
రాజ్యాధికారమీయలేదా?
ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి
పరలోక రాజ్యమీయలేదా?
(2)         ||శ్రమలందు||

Video