శ్రీ యేసుండు జన్మించె
Shree Yaesumdu Janmimche
UncategorizedAdded on 11/8/2014
Lyrics
నేడు పాయక బెత్లెహేము ఊరిలో ||శ్రీ యేసుండు|| ఆ కన్నియ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనెడి నామమందున ||శ్రీ యేసుండు|| సత్రమందున పశువులశాల యందున దేవపుత్రుండు మనుజుండాయెనందునా ||శ్రీ యేసుండు|| పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి పశుల తొట్టిలో పరుండ బెట్టబడి ||శ్రీ యేసుండు|| గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా దెల్పె గొప్ప వార్త దూత చల్లగా ||శ్రీ యేసుండు|| మన కొరకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషములబోగొట్టెను ||శ్రీ యేసుండు|| పరలోకపు సైన్యంబు గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీ యేసుండు|| అక్షయుండగు యేసు పుట్టెను మనకు రక్షణంబు సిద్ధపరచెను ||శ్రీ యేసుండు||