సిలువ ధ్యానం
Siluva Dhyaanm
UncategorizedAdded on 3/14/2017
Lyrics
విలువైన రుధిరాన్ని కార్చి వెలపోసి నన్ను కొన్నావు ప్రేమా త్యాగం నీవే యేసయ్యా మహిమా నీకే ఆరోపింతును గాయాలు పొందినావు – వెలివేయబడినావు నా శిక్ష నీవు పొంది – రక్షణను కనుపరచావు నీ ప్రేమ ఇంత అంతని – నే తెలుపలేను నీ కృపను చాటెదన్ – నా జీవితాంతము నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ – మోయలేక మోసావు కొరడాలు చెళ్ళని చీల్చెనే – నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా సిలువలో ఆ సిలువలో – ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా విలువే లేని నా బ్రతుకును – విలువ పెట్టి కొన్నావయ్యా నాదు పాపమంతయూ నీదు భుజముపై మోసావయ్యా గొల్గొతా కొండ పైన గాయాలు పొందితివే చెమటయు రక్తముగా – ఆత్మల వేదనయూ పొందెను యేసు నీ కొరకే తండ్రీ నీ చిత్తం – సిద్ధించు గాక అని పలికెను కల్వారిలో జీవామిచ్చెన్ నీ పాపములను తొలగించుటకై నీదు సిలువన్ మోసెను యేసు రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము చలించిపోయెనే ఆ సిలువ ధాటికి కసాయి చేతిలో అల్లాడిపోయెనే రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము కృపా సత్య దేవా – సిలువలో మాకై బలియై రక్తము చిందించినావు – రక్షణిచ్చినావు ఆరాధింతుము నిన్ను యేసు – ఆత్మ సత్యముతో పాడి కొనియాడి కీర్తింతుము పూజించి ఘనపరతుము హాల్లేలూయా హాల్లేలూయా నిన్నే ఆరాధింతుమ్