సిలువే నా శరణాయెను రా
Siluvae Naa Sharanaayenu Raa
UncategorizedAdded on 4/15/2017
Lyrics
నీ… సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ చాలును రా నీ… సిలువే నా శరణాయెను రా పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక సిలువ యెదుటను నిలచినాడను రా నీ… సిలువే నా శరణాయెను రా శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీ దరి జేరితి రా నీ… సిలువే నా శరణాయెను రా