సిలువలో నీ ప్రేమ

Siluvalo Nee Praema

UncategorizedAdded on 3/25/2018

Lyrics

మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా
ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి
(2)      ||సిలువలో||
తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం
నను విడిపించుటకు – విలువను విడిచితివి
పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి
(2)     ||ఘోర పాపిని||
దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం
నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు – బలిగా మారితివి
(2)     ||ఘోర పాపిని||
అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము
నిను చాటించుటకు – వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను
(2)     ||ఘోర పాపిని||