సంబరాలు చేసేద్దామా

Smbaraalu Chaesaeddaamaa

Lyricistరాజేష్ జాషువా
UncategorizedAdded on 12/1/2022

Lyrics

రాజులకే రారాజు పుట్టాడోయ్
దివి నుంచి భువికే వచ్చాడోయ్
ఊరూ వాడా కలిసి రారండోయ్
సంబరాలు సంబరాలు చేయండోయ్…
అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని
పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి
పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా –
పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని
సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని
జన్మ పాపమే లేనివాడని
నీదు భారము మోయువాడని
(2)       ||ఆర్భాటించి||
వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని
కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని
మార్గం సత్యము జీవం యేసని
మోక్ష ద్వారమై పుట్టినాడని
(2)       ||ఆర్భాటించి||
సంబరాలు సంబరాలు చేసేద్దామా
క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా

Video