సందేహమేల
Smdaehamaela
Lyricistసందేహమేల సంశయమదేల
UncategorizedAdded on 10/16/2017
Lyrics
ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల|| ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే నీ పాప శిక్షను తానే – భరియించెనే ప్రవహించె రక్త ధార నీ కోసమే కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల|| ఎందాక యేసుని నీవు – ఎరగనందువు ఎందాక హృదయము బయట – నిలవమందువు యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల|| ఈ లోక భోగములను – వీడజాలవా సాతాను బంధకమందు – సంతసింతువా యేసయ్య సహనముతోనే చెలగాటమా ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల|| లోకాన ఎవ్వరు నీకై – మరణించరు నీ శిక్షలను భరియింప – సహియించరు నీ తల్లియైన గాని నిన్ను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల||