సంతోషముతో నిచ్చెడు వారిని
Smthoshamutho Nichchedu Vaarini
UncategorizedAdded on 11/3/2018
Lyrics
సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుడు ప్రేమించెన్ వింతగ వలసిన-దంతయు నొసంగును వినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో|| అత్యాసక్తితో నధిక ప్రేమతో నంధకార జను-లందరకు సత్య సువార్తను జాటించుటకై సతతము దిరిగెడు సద్భక్తులకు ||సంతోషముతో|| వేద వాక్యమును వేరు వేరు గ్రా మాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో|| దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువ లన్నిటి దీర్చుటకై నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు ప్రక్కలలో బ్రక-టించుట కొరకై ||సంతోషముతో|| ఇయ్యండీ మీ కీయం బడు నని యియ్యంగల ప్రభు యే-సనెను ఇయ్యది మరువక మదిని నుంచుకొని యియ్యవలెను మన యీవుల నికను ||సంతోషముతో|| భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు యుక్త మటంచు ను-దారతతో శక్తి కొలది మన భుక్తి నుండి యా శక్తితో నిరతము నియ్య వలెను ||సంతోషముతో||