సంతోషించుడి యందరు
Smthoshimchudi Ymdaru
UncategorizedAdded on 12/7/2019
Lyrics
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని సంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి|| అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి|| కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె భక్తుల మనము సంతసించె ||సంతోషించుడి|| మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించె మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే భక్తుల కన్ను లాస దీరె ||సంతోషించుడి|| ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును నీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁ దెలుపఁగ నాతురపడవలెను ||సంతోషించుడి|| పాపులపై దేవునికి గలిగిన ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను జూపక పోయిన లోపము మనపై – మోపబడును నిజము వేగము జూపుద మా పథము ||సంతోషించుడి||