స్నేహితుడా నా స్నేహితుడా

Snaehithudaa Naa Snaehithudaa

Lyricistసిరివెల్ల హనోక్
UncategorizedAdded on 4/29/2017

Lyrics

స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రాణ స్నేహితుడా
ఆపదలో నన్నాదుకొనే
నిజమైన స్నేహితుడా
నన్నెంతో ప్రేమించినావు
నాకోసం మరణించినావు
మరువగలనా నీ స్నేహము
మరచి ఇల నే మనగలనా
(2)      ||స్నేహితుడా||
నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
నే వేచానే నిరతం నీ తోడుకై
ఇచ్చెదన్ నా సర్వస్వము
నాకున్న ఆశలు ఈడేర్చుము
(2)      ||స్నేహితుడా||
కన్నీటితో ఉన్న నన్ను
కరుణించి నను పలుకరించావు
మండిన ఎడారిలోన
మమత వెల్లువ కురిపించినావు
(2)      ||స్నేహితుడా||

Video