సొంతమైపోవాలి నా యేసుతో
Somthamaipovaali Naa Yaesutho
UncategorizedAdded on 10/15/2016
Lyrics
సొంతమైపోవాలి నా యేసుతో మిళితమై పోవాలి నా ప్రియునితో సొంతమై మిళితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో లీనమై పోవాలి ఆ ప్రేమలో నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కలువరిలో బలియాయెను బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2) ||సొంతమై|| పరదేశిగా నేను వచ్చానిలా తన ప్రేమ కీర్తిని చాటాలని ప్రియుని కోసమే బ్రతికెదను కాపాడుకొందును సౌశీల్యము ప్రభువు కోసమే బ్రతికెదను కాపాడుకొందును నా సాక్ష్యము యేసుతో జీవితం పరమున శాశ్వతం (2) ||సొంతమై||