సూడ సక్కని బాలుడమ్మో

Sooda Sakkani Baaludammo

UncategorizedAdded on 12/1/2018

Lyrics

సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు
బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను
మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను

Video