సృష్టి కర్తా యేసు దేవా
Srushti Karthaa Yaesu Daevaa
UncategorizedAdded on 2/12/2017
Lyrics
సర్వ లోకం నీ మాట వినును సర్వ లోక నాథా సకలం నీవేగా సర్వ లోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము ||సృష్టి|| కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షా రసము చేసి కనలేని అంధులకు చూపు నొసగి చెవిటి మూగల బాగు పరచితివి నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ|| మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ||