స్తోత్ర గానం చేసింది ప్రాణం
Sthothra Gaanm Chaesimdi Praanm
Lyricistసామి పచిగల్ల
UncategorizedAdded on 11/21/2018
Lyrics
స్తోత్ర గానం చేసింది ప్రాణం క్రొత్త రాగం తీసింది హృదయం నా యేసు ప్రేమ నా మదంతా నిండగా ధన్యమే ఈ జీవితం యేసుతో మరింత రమ్యమే భూమిపై చిన్ని స్వర్గమే యేసుతో నా ప్రయాణమే నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే|| నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే యేసులో నిత్యమే ||స్తోత్ర|| ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే యేసులో నిత్యమే ||స్తోత్ర||