స్తోత్రబలి అర్పించెదము

Sthothrabali Arpimchedamu

Lyricistఎస్ జె బెర్క్మన్స్
UncategorizedAdded on 7/10/2018

Lyrics

స్తోత్రబలి అర్పించెదము
మంచి యేసు మేలు చేసెన్
చేసెను మేలులెన్నో
పాడి పాడి పొగడెదన్
తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం
ప్రాణమిచ్చి నను ప్రేమించి
పాపం తొలగించి కడిగితివే
నీ కొరకు బ్రతుక వేరుపరచి
సేవ చేయ కృప ఇచ్చితివే
(2)           ||తండ్రీ||
గొప్ప స్వరముతో మొరపెట్టి
సిలువ రక్తమును కార్చితివే
రక్త కోటలో కాచుకొని
శత్రు రాకుండ కాచితివే
(2)           ||తండ్రీ||
చూచే కన్నులు ఇచ్చితివి
పాడే పెదవులు ఇచ్చితివి (2)
కష్టించే చేతులు ఇచ్చితివి
పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ||
మంచి ఇల్లును ఇచ్చావయ్యా
వసతులన్నియు ఇచ్చావయ్యా
కష్టించి పనిచేయ కృప చూపి
అప్పు లేకుండ చేసితివే
(2)           ||తండ్రీ||

Video