స్తోత్రబలి స్తోత్రబలి
Sthothrabali Sthothrabali
Lyricistఎస్ జె బెర్క్మన్స్
UncategorizedAdded on 2/7/2017
Lyrics
స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||