స్తోత్రించెదము
Sthothrimchedamu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 6/30/2023
Lyrics
స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన