స్తోత్రం చెల్లింతుము
Sthothrm Chellimthumu
Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 11/12/2014
Lyrics
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| దివారాత్రములు కంటిపాపవలె కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి ||స్తోత్రం|| గాడాంధకారములో కన్నీటి లోయలలో కృశించి పోనీయక కృపలతో బలపరచితివి ||స్తోత్రం|| సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి ||స్తోత్రం|| సీయోను మార్గములో పలుశోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి ||స్తోత్రం|| పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా ||స్తోత్రం||