స్తుతి గానమే పాడనా
Sthuthi Gaanamae Paadanaa
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 2/17/2018
Lyrics
స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా నా ఆధారమైయున్న యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి నీ ధర్మాసనము – నా హృదయములో స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి నీ శ్రేష్టమైన – పరిచర్యలకై కృపావరములతో నను – అలంకరించితివే (2) ||స్తుతి|| నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది నీ సింహాసనము – నను చేర్చుటకై నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) ||స్తుతి||