స్తుతి పాడుటకే
Sthuthi Paadutakae
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 12/5/2022
Lyrics
స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే|| ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే|| నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను ||స్తుతి పాడుటకే|| హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై ||స్తుతి పాడుటకే||