స్తుతి ప్రశంస పాడుచు
Sthuthi Prashmsa Paaduchu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 2/20/2024
Lyrics
స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను పాపలోక బంధమందు దాసత్వమందుండ నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి (2) ||స్తుతి ప్రశంస|| పాప భారముచే నేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు (2) ||స్తుతి ప్రశంస|| హృదయాంధకారముచే నేను దారి తొలగితి ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె (2) ||స్తుతి ప్రశంస|| పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి (2) ||స్తుతి ప్రశంస||