స్తుతి సింహాసనాసీనుడా

Sthuthi Simhaasanaaseenudaa

Lyricistఅంశుమతి మేరీ
UncategorizedAdded on 7/16/2016

Lyrics

స్తుతి సింహాసనాసీనుడా
యేసు రాజా దివ్య తేజా
అద్వితీయుడవు పరిశుద్ధుడవు
అతి సుందరుడవు నీవే ప్రభూ
నీతి న్యాయములు నీ సింహాసనాధారం
కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు
(2)       ||స్తుతి||
బలియు అర్పణ కోరవు నీవు
బలియైతివి నా దోషముకై
నా హృదయమే నీ ప్రియమగు ఆలయం
స్తుతియాగమునే చేసెద నిరతం
(2)       ||స్తుతి||
బూరధ్వనులే నింగిలో మ్రోగగా
రాజధిరాజ నీవే వచ్చువేళ
సంసిద్ధతతో వెలిగే సిద్దెతో
పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును
(2)       ||స్తుతి||

Video