స్తుతికి పాత్రుడ యేసయ్యా
Sthuthiki Paathruda Yaesayyaa
Lyricistఫిలిప్ గరికి
UncategorizedAdded on 12/28/2017
Lyrics
స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత నీవే నా విడుదల (2) ||స్తుతికి|| పాప ఊభిలో నుండి – పైకి లేపితివి మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ నీ వెనకే చేరెద యేసూ జీవాహారము నీవే – జీవ జలము నీవే నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును యేసు రాజా నీ యెదుట