స్తుతించెదను నిన్ను నేను

Sthuthimchedanu Ninnu Naenu

UncategorizedAdded on 5/23/2020

Lyrics

భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీ కర్పించెదను
(2)        ||స్తుతించెదను||
పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించె మిత్రుడవు
పరము చేర్చి ఫలములిచ్చె
పావనుడగు మా ప్రభువు నీవే
(2)        ||స్తుతించెదను||
కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య
(2)        ||స్తుతించెదను||
సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును
(2)        ||స్తుతించెదను||

Video