స్తుతించెదను స్తుతించెదను

Sthuthimchedanu Sthuthimchedanu

Lyricistస్తుతించెదను స్తుతించెదను
UncategorizedAdded on 2/6/2017

Lyrics

నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము
||స్తుతించెదను||
ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను
(2)         ||స్తుతించెదను||
నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి
(2)         ||స్తుతించెదను||
పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి
పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన
పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా
(2)         ||స్తుతించెదను||
తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును
దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా
దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి
(2)         ||స్తుతించెదను||
సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన
స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా
శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా
(2)         ||స్తుతించెదను||

Video