స్తుతించి పాడెదం

Sthuthimchi Paadedm

UncategorizedAdded on 9/8/2016

Lyrics

ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్
స్తుతుల సింహాసనం మీదాసీనుడా
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము
(2)         ||స్తుతించి||
గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు
వ్యధలన్ని తీసావు
గతి లేని మాపై నీవు
మితిలేని ప్రేమ చూపి
శత సంఖ్యగా మమ్ము దీవించావు
||స్తుతించి||
కరుణా కటాక్షములను కిరీటములగాను
ఉంచావు మా తలపై
పక్షి రాజు యవ్వనమువలె
మా యవ్వనమునంతా
ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు
||స్తుతించి||

Video