స్తుతియించి కీర్తించి
Sthuthiyimchi Keerthimchi
UncategorizedAdded on 2/2/2017
Lyrics
సునీల్ ప్రేమ్ కుమార్ స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి|| గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి|| అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి|| పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||