స్తుతియు మహిమ (ఆరాధన)

Sthuthiyu Mahima Aaraadhana

UncategorizedAdded on 1/6/2021

Lyrics

జి డేవిడ్ విజయరాజు
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగ యుగములు కలుగును దేవా
పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో
కొనియాడబడుచున్న దేవా
ఆరాధన ఆరాధన
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
పరిశుద్ధ స్థలములలో వసియించువాడా
ఆరాధన ఆరాధన
ఆ.. ఆ.. ఆ.. హల్లెలూయా
యుగ యుగములకు తర తరములకు
మహిమా నీకే
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతుల మీద ఆసీనుడా
ఆరాధన ఆరాధన
(2)        ||స్తుతియు||
మహిమా నీకే మహోన్నతుడా
మనసారా నిన్నే స్తుతియింతుము
ఆరాధన ఆరాధన
(2)        ||స్తుతియు||

Video