స్తుతియు మహిమ ఘనత నీకే
Sthuthiyu Mahima Ghanatha Neekae
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 11/5/2013
Lyrics
స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ||స్తుతియు|| మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని ||స్తుతియు|| నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము ||స్తుతియు|| నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను ||స్తుతియు|| భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మా కొరకు మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము ||స్తుతియు||