సుమధుర స్వరముల గానాలతో
Sumadhura Svaramula Gaanaalatho
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 8/1/2019
Lyrics
సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడచినా – ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము (నీవే) నీవే నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము (నీవే) నీవే నా స్తుతిగీతము (2) ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము (నీకే) నీకే నా ఆరాధన (2) ||సుమధుర||