సుందరములు

Sumdaramulu

Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 8/14/2020

Lyrics

సుందరములు అతి సుందరములు
సువార్త మోసిన పాదములు
అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు
ప్రభు ప్రేమను చాటిన పెదవులు
ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు
ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు
యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు
తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు
ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు
(2)      ||ఏ లేమికి||
లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు
తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు
తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు
తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు
(2)      ||ఏ లేమికి||

Video