సువార్తను ప్రకటింపవా

Suvaarthanu Prakatimpavaa

UncategorizedAdded on 10/15/2017

Lyrics

సామ్ జె వేదాల
సువార్తను ప్రకటింపవా
సునాదము వినిపింపవా
సిలువను ధరియించవా
దాని విలువను వివరింపవా
లెమ్ము సోదరా
లేచి రమ్ము సోదరీ
(2)        ||సువార్తను||
సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారం మరచినావు
సోమరివై నీవుండి
స్వామికి ద్రోహం చేయుదువా
(2)        ||లెమ్ము||
నీలోని ఆత్మను ఆరనీకు
ఎదలో పాపము దాచుకోకు
నిను నమ్మిన యేసయ్యకు
నమ్మక ద్రోహం చేయుదువా
(2)        ||లెమ్ము||

Video