స్వఛ్చంద సీయోను వాసి
Svachhchmda Seeyonu Vaasi
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 3/14/2018
Lyrics
స్వఛ్చంద సీయోను వాసి సర్వాధికారి – కస్తూరి పూరాసి వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి అల్ఫా ఒమేగ తానే ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద|| ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి యెదుట పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే లెక్క లేని యద్భుతముల్ మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద|| సంగీతం నాదముల తోడ సీయోను పురము – సొంపుగను చేరితిమి శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ దుఃఖము నిట్టూర్పును పోయెన్ మిక్కిలి ఆనందము కల్గెన్ (2) ||స్వఛ్చంద|| నీలముల పునాదులు వేసి నీలాంజనములతో – మాణిక్య మణులతో సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో ప్రశస్త రత్నములతో ప్రవిమలముగా నిను గట్టెదను (2) ||స్వఛ్చంద|| సుమముల హారము సంతోషానంద తైలము నీదే – స్తుతి వస్త్రమును నీదే ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే హిత వత్సరము విముక్తి ఆత్మాభిషేకము నీదే (2) ||స్వఛ్చంద|| జలములలో బడి దాటునప్పుడు బలమై యుండెదను – నీ తోడై యుండెదను నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నిను కాల్చగ లేవు (2) ||స్వఛ్చంద|| ఇత్తడి తలుపుల బగుల గొట్టెద నినుప ఘడియలను – విడగొట్టెదను నేను అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను రహస్యములో మరుగైన ధనమును నీ కొసంగెదను (2) ||స్వఛ్చంద|| గర్భమున పుట్టినది మొదలు తల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా ముదిమి వచ్చుఁ వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే (2) ||స్వఛ్చంద||