తార వెలిసింది
Thaara Velisimdi
Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 10/31/2016
Lyrics
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే ||తార||