తారా వెలిసెను ఈ వేళ
Thaaraa Velisenu Ee Vaela
Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 4/29/2020
Lyrics
తారా వెలిసెను ఈ వేళ యేసు పుట్టిన శుభవేళ వెలిగెను ఈ లోకం – మదిలో నిండెను ఆనందం తరగని రక్షణను – మనకై తెచ్చెను ఆ దైవం రండి వార్తను చాటుదాము ఆ రక్షణను పంచుదాము పశుల పాకే పావనమాయె మంద గొల్లలే తన వారాయె జ్ఞానులొచ్చిరి ఆరాధింప రాజులలో భీతిని నింప పాపమెరుగని నీతి పరుడు లోకమును కాచే రక్షకుడు కన్య మరియా గర్భమున పుట్టెను దేవుని అంశమున రాజులకు రాజైన తనకు ఇచ్చుటకు ఏమున్నది మనకు వెండి బంగారముల కన్నా హృదములనర్పిస్తే మిన్నా