తలవంచకు నేస్తమా
Thalavmchaku Naesthamaa
Lyricistజాన్ వెస్లీ
UncategorizedAdded on 1/12/2018
Lyrics
తలవంచకు నేస్తమా తలవంచకు ఎప్పుడూ తలవంచకు ఎన్నడూ స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో నీవు కావాలి ఓ.. మాదిరి నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ నీవు మండాలి ఓ.. జ్వాలగా నీవు చేరాలి ఓ.. గమ్యము ||తలవంచకు|| చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే పెకిలించు కొండలను – విశ్వాస బాటలో గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో