తమ దేవునెరుగువారు

Thama Daevuneruguvaaru

Lyricistసీయోను గీతములు
UncategorizedAdded on 7/25/2025

Lyrics

తమ దేవునెరుగువారు చేసెదరు
శక్తితో గొప్ప కార్యములు
ఇచ్చకపు మాటల వలన – అక్షయుని విడువరు
తప్పుబోధల నెప్పుడు తృణీకరించెదరు
సత్యమును విడువరు – ఉత్తములుగా నడిచెదరు
అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు
మనుజ భయము జెందరు – మాన్యులై యుండెదరు
మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు
ద్వేషించెదరు విగ్రహముల్ – శిరములు ఖండించినను
పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు
అగ్నిలో వేయబడినను – విఘ్నంబులు కలిగినను
సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు
శోధనలను జయించెదరు – బాధలను సహించెదరు
నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు
అదిక జ్ఞానమును పొంది – తగ్గించుకొనెదరు తామే
యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు

Video