తనువు నా దిదిగో
Thanuvu Naa Didigo
Lyricistముంగమూరి దేవదాసు
UncategorizedAdded on 7/23/2016
Lyrics
తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ దినములు క్షణములు – దీసికొని యవి నీదు వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ ||తనువు|| ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో ||తనువు|| స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు ||తనువు|| వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో ||తనువు|| నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ ||తనువు|| ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్ నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద ||తనువు||