తెల్లారింది వేళ

Thellaarimdi Vaela

Lyricistశామ్యూల్ కర్మోజి
UncategorizedAdded on 8/4/2017

Lyrics

అన్నయ్య… తెల్లారింది లేరా..
తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా
మనమంతా ఆయన సృష్టే రా
పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా
వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా
అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ
యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా
వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను
రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా
మరచిపోవునా
||తెల్లారింది||
చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ
విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా
వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని
నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా
నీకు తెలియునా
||తెల్లారింది||

Video