తండ్రీ దేవా

Thmdree Daevaa

UncategorizedAdded on 6/18/2021

Lyrics

టెన్నీ జినాన్స్ జాన్
తెలుగు అనువాదం:
క్రిస్టోఫర్ చాలూర్కర్ & దీపక్ దినకర్
తండ్రీ దేవా… తండ్రీ దేవా…
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
నా ప్రియుడా నా ప్రాణమా – నిన్నారాధించెదన్
నా జీవమా నా స్నేహమా – నిన్నారాధించెదన్
(2)      ||తండ్రీ||
నీ ప్రేమ వర్ణించుట – నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా
తండ్రీ దేవా… నా ఆనందమా…
నీ ఒడిలో నాకు సుఖము
నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా – నీ ప్రేమ మధురమయ్యా
తండ్రీ దేవా… నా ఆనందమా…
నీ ఒడిలో నాకు సుఖము

Video