తూరుపు దిక్కున
Thoorupu Dikkuna
Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 12/17/2021
Lyrics
తూరుపు దిక్కున చుక్క బుట్టె దూతలు పాటలు పాడ వచ్చె చలి మంట లేకుండా ఎలుగే పుట్టె చల్లని రాతిరి కబురే తెచ్చె పుట్టినాడంట యేసునాథుడు పాపములు తీసే పరమాత్ముడు (2) ||తూరుపు|| గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి కొలిచినారు తనకు కానుకలిచ్చి పశుల పాక మనము చేరుదాము కాపరిని కలిసి వేడుదాము (2) ||పుట్టినాడంట|| చిన్నా పెద్దా తనకు తేడా లేదు పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు తానొక్కడే అందరికీ రక్షకుడు మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2) ||పుట్టినాడంట|| మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు నమ్మి నీవు యేసును అడిగి చూడు తన ప్రేమను నీకు అందిస్తాడు (2) ||పుట్టినాడంట||