త్రిత్వైకమా
Thrithvaikamaa
UncategorizedAdded on 10/8/2016
Lyrics
జీవ ఆర్ పాకెర్ల త్రిత్వైకమా సకలేశ్వరా పూజ్యుడౌ శ్రేయస్కరా ధ్యానించెద హృది వాంఛతో గళమెత్తెద మృదు భాషతో నా సుతుడా సర్వే సుతుడా నా జనకా సర్వే జనకా ||త్రిత్వైకమా|| దోష భావముకు బంధునవ్వగా దేహ ఇఛ్చలలో స్థిరమవ్వగా వాక్యపు వెలుగై నాకిల వెలుగై ముక్తినిచ్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా|| క్షితియందు ఎరకు మోసిపోతిని క్షమలేక ఇలలో మృతమైతిని వెల దాతవై జీవ దాతవై స్థితి మార్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా||