తుప్పు పట్టి పోవుటకంటే

Thuppu Patti Povutakmtae

Lyricistశైలన్న
UncategorizedAdded on 10/29/2015

Lyrics

తుప్పు పట్టి పోవుటకంటే
కరిగిపోత యేసయ్య నీ చేతిలో
అరిగిపోత యేసయ్య నీ సేవలో
(2) ||తుప్పు పట్టి||
సుఖమనుభవించుటకంటే
శ్రమలనుభవిస్తాను నీ సేవలో
నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా
(2) ||తుప్పు పట్టి||
వెన్న లాగ కరుగుకుంట
కటిక చీకట్ల దీపమైతానయ్యా
నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా
(2) ||తుప్పు పట్టి||
మూర్ఖమైన వక్ర జనం మధ్యల
ముత్యమోలె నేనుండాలి యేసయ్యా
దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా
(2) ||తుప్పు పట్టి||
వెండి బంగారాల కన్నా
ధన ధాన్యముల కన్నా
నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా
నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా
(2) ||తుప్పు పట్టి||
నాలో ఊపిరున్నంత వరకు
ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను
కటిక చీకట్ల దీపమెలిగిస్తాను
(2) ||తుప్పు పట్టి||

Video